రీడింగ్ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:09 AM
జిల్లాస్థాయి రీడింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.
పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి రీడింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా పోటీలు నిర్వహించినట్లు తె లిపారు. 14 మండలాల నుంచి 22 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో చదవడం, కథలు చెప్పడం వంటి అంశాలలో పోటీలు నిర్వహించారన్నారు. రీడింగ్ కాంపీటీషన్ నిర్వ హించి పిల్లలకు బహుమతులు ఇవ్వాలని ఆలోచన చేసిన ఉపాధ్యాయు లను కలెక్టర్ అభినందించారు. సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలను అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా విద్యాధికారి శారద, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్, జిల్లా రిసోర్స్ టీం అధికారి గడ్డం జగదీశ్వర్, పాల్గొన్నారు.