Share News

చిన్నారులకు ప్రేమపూర్వక సంరక్షణ కల్పించాలి

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:40 PM

చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్‌లోని బాలసదన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిశు గృహాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రారంభించారు.

చిన్నారులకు ప్రేమపూర్వక సంరక్షణ కల్పించాలి

సుల్తానాబాద్‌, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్‌లోని బాలసదన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిశు గృహాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశుగృహలో కల్పించిన సౌకర్యాలను పరి శీలించి, చిన్నారులకు అందించే సంరక్షణ, వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అనాథ, సంరక్షణ అవసరమైన పిల్లలకు సురక్ష్షితమైన ఆశ్రమం కల్పించాలన్నారు. జననం నుంచి ఆరేళ్ల లోపు వయస్సు గల చిన్నారులకు ప్రేమపూర్వక సంరక్షణ, పోష కాహారం, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరి రక్షణ అవకాశాలను కేంద్రం ద్వారా అందిం చనున్నట్లు తెలిపారు. అర్హులైన చిన్నారు లకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా కుటుంబ వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ కేంద్రం లక్ష్యాల్లో భాగమని అధికారులు తెలిపారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, సీడీపీఓ అనిత, సీనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారా యణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి జితేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:40 PM