పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
ABN , Publish Date - May 16 , 2026 | 11:37 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రభుత్వం విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకువస్తుందన్నారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభు త్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షేక్, మండల విద్యాధికారి సురేందర్ కుమార్, టీఫైబర్ సంస్థ మేనేజర్ శ్రీరామ్ రాహుల్, సీఆర్‌పీలు బాలసాని వెంకటేశం, సుందరగిరి శ్రీనివాస్, కుంబాల సుధాకర్, యూసుఫ్, టీ ఫైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.