Share News

బాల్యాన్ని ‘నులి’పేస్తోంది...

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:31 AM

పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరాపడుతారు.

బాల్యాన్ని ‘నులి’పేస్తోంది...

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరాపడుతారు. ఇది నులిపురుగుల నొప్పి కూడా కావొచ్చు. పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండే తల్లిదండ్రులను ఇబ్బందికి గురిచేసే నులిపురుగులు తయారు కావడం ప్రధానంగా శుభ్రత పాటించకపోవడమే కారణం. నులిపురుగులతో ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే సమస్యగా ఉంటాయి. ముఖ్యంగా సంవత్సరం పిల్లవాడి నుంచి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులి పురుగులు, కొంకి పురుగులు, కొరడా పురుగులు, బద్దె పరుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు.. ఇలా మన పొట్టలో చేరి అనేక రోగాలకు కారణమవుతుంటాయి. వీటి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది రెండుసార్లు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సోమవారం జూలె ౖ13న మాత్రలు వేస్తారు. ఆరోజు మాత్రలు వేసుకోని వారికి 20వ తేదినమాప్‌ఆప్‌డేగా తప్పనిసరిగా నులి పురుగుల మాత్రలు పంపిణీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా 33 వేల 695 మందికి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు వేసే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించే విధంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మార్గనిర్ధేశం చేశారు.

నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత..

పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులకు సంతోషం. ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ఆరోగ్య సమాజం కోసం ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా అనారోగ్య సమస్యలతో సతమతమవతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,33,695 మందికి మాత్రల పంపిణీ లక్ష్యాన్ని పెట్టుకోగా ఏడాది నుంచి 19 ఏళ్ల వయసుల వారీగా లక్ష్యాలను గుర్తించారు. జిల్లాలో 47 జూనియర్‌ కాలేజీలు, 636 పాఠశాలలు, 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మాత్రల పంపణీ కోసం ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, కళాశాలల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

వయస్సును బట్టి మాత్ర..

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేసే అల్బెండజోల్‌ మాత్రలను వయస్సును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి,రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను, 2-3 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి మింగించాలి. ఆపైబడిన వారికి 400ఎంజీ అల్బెండజోల్‌ మాత్రను చప్పరించి లేదా నమిలి మింగించాలి.

పొట్టలో దర్జాగా పురుగులు...

అపరిశభ్రతతో అనేక పురుగులు పిల్లల పొట్టలోకి చేరిపోతాయి. పిల్లలు తినే ఆహారం లోపల దర్జాగా తింటూ ఉంటాయి. ఈ పురుగులు పొట్టలోకి ఎలా వస్తాయంటే అపరిశభ్రతతో నులిపరుగులు, ఇతర పురుగులు మన పొట్టల్లో వృద్ధి చెందుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకొని వచ్చి అదే చేతితో తినుబండారాలు తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా తింటుంటారు. మహిళల్లో బియ్యం ఏరుతూ మట్టిగడ్డలు తినే అలవాటు కూడా ఉంటుంది. చేలల్లో గరకలు, మట్టిని కూడా చప్పరిస్తుంటారు. దీంతో మట్టిలో పురుగుల గుడ్లు మన పొట్టలోకి వెళ్లిపోతుంటాయి. అంతేకాకుండా మలం మీద వాలిన ఈగలు తిరిగి మనం తినే ఆహారపదార్థాల మీద వాలడం వల్ల పురుగుల గుడ్లు ఆహారం మీద ఉండిపోతాయి. తాగునీటి పైపులైన్లలో డ్రైనేజీ నీళ్లు కలవడం వల్ల కూడా ఈ గుడ్లు మనలో చేరుతాయి. పెరిగిన గోళ్లు వాటిలో ఇరుక్కుపోయిన మట్టి వళ్ల కూడా గుడ్లు పొట్టలోని వెళ్లి నులిపురుగులు, కొంకి పురుగులు, కొరడా పాములు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు తయారవుతాయి.

అపోహలు వద్దు.. మాత్రలు వేసుకోవాలి..

- డాక్టర్‌ జి ఎంజేలా ఆల్ర్ఫేడ్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

నులిపురుగుల నివారణ కోసం పంపిణీ చేసే అల్బెండజోల్‌ మాత్రలు సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు వారందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. ఆల్బెండజోల్‌ మాత్రల వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలి. ప్రధానంగా రక్తహీనత, పిల్లల ఎదుగుదలపై నులిపురుగుల ప్రభావం చూపుతాయి. ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా మాత్రలు పంపిణీ చేస్తాం. ఆరోజు మాత్రలు తీసుకోని వారికి 20వ తేదిన మాత్రలు అందిస్తాం. జిల్లాలో 1.33 లక్షల మందికి మాత్రలు అందించే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తారు. 1-2సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2-19 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక మాత్రను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందజేశారు. నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి బలహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నివారణకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వినియోగించడం, పాదరక్షలు ధరించడం, బహిరంగ మలవిసర్జనకు బదులుగా మరుగుదొడ్లను వినియోగించడం వంటి పరిశుభ్రత చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా లక్ష్యం

ఆరోగ్య కేంద్రం అర్హులు

బోయిన్‌పల్లి 3233

చందుర్తి 10387

చీర్లవంచ 4556

ఇల్లంతకుంట 7115

హనుమాజీపేట 24449

కొదురుపాక 1737

కొనరావుపేట 7780

లింగన్నపేట 13540

నేరెళ్ల 3640

పోతుగల్‌ 8988

తంగళ్ళపల్లి 9342

విలాసాగర్‌ 962

ఎల్లారెడ్డిపేట 15789

సిరిసిల్ల పిఎస్‌నగర్‌ 9812

సిరిసిల్ల అంబేద్కర్‌నగర్‌ 12365

మొత్తం 133695

Updated Date - Jul 12 , 2026 | 12:31 AM