Share News

బాలల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:12 AM

బాలల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్ష ణపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు.

బాలల సంరక్షణ   ప్రతీ ఒక్కరి బాధ్యత

పెద్దపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): బాలల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్ష ణపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల సంరక్ష ణలో ప్రతీ ఒక్కరి బాధ్యత ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మిషన్‌ వాత్సలయ్‌, అంగన్‌వాడీ సేవలు, ప్రీ ప్రైమరీ విద్య, బాల సదనాల ద్వారా పిల్లల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. ప్రతీ బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం, సురక్షిత వాతావరణం పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏ చిన్నారికి అయినా సమస్యలు ఎదురైతే వెంటనే 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా లో విద్యా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు నాణ్యత పెంపుపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కేం ద్రాల్లో పిల్లలకు సమతుల్య పోషకాహారం అందిస్తూ వారి ఎదుగుదలను పర్యవేక్షిస్తు న్నామన్నారు. ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం ద్వారా పిల్లలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీ క్షలు నిర్వహిస్తూ ఏ ఆరోగ్య సమస్య ఉన్నా తక్షణ చికిత్స అందిస్తున్నామని, అవసర మైతే శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. అనంతరం బాల్య వివాహాల రహిత గ్రామంగా ఎంపికైన బ్రాహ్మణపల్లి సర్పంచ్‌కు కలెక్టర్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. డీడబ్ల్యూవో వేణుగోపాల్‌ రావు, డీఆర్‌డీఓ కాళిందిని, ఏపీడీఓ రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:12 AM