బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలి
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:01 AM
సమా జంపై అవగాహన లేక గ్రామాల్లో బాల్యంలోనే వివా హాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన అన్నారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): సమా జంపై అవగాహన లేక గ్రామాల్లో బాల్యంలోనే వివా హాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ మేకల రోజారాణి-విజయ్ అధ్యక్షతన బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తుందన్నారు. బాల కార్మికులు, పాఠశాల విడిచిపెట్టిన పిల్లలు, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలపై అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. బ్రాహ్మణపల్లి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే దేశంలోనే బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించబడిన తొలి గ్రామం గా బ్రాహ్మణపల్లి గుర్తింపు పొందే అవకాశముందని తెలి పారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన అధికారు లను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఝాన్సీలతో పాటు పలువురు పాల్గొన్నారు.