గొర్రెలు, మేకల బీమాపై హర్షం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:24 AM
గొర్రెలు, మేకల పెంప కందారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంపై గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం, మంత్రి, విప్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): గొర్రెలు, మేకల పెంప కందారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంపై గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం, మంత్రి, విప్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసి డెంట్ సంధనవేణి రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకం వేలాది కుటుంబాలకు జీవనాధారమని, ప్రమాదాలు, వ్యాధు లు, కుక్కల దాడులు తదితర కారణాలతో మృతి చెందే పెంపకందా రులకు బీమా పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఈ పథ కాన్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక చొరవ చూపారని కృతజ్ఞతలు తెలిపారు. పర్స బక్కయ్య, పెగడ రమేష్, తాత రాజు, సామ తిరుపతి, ఉప్పరి శ్రీనివాస్, ఉడుత పర్వతాలు, అట్ల సాగర్, నాగరాజు పాల్గొన్నారు.