Share News

ప్రైవేట్‌ ఫీజుల దోపిడీకి చెక్‌

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:25 AM

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటిం చేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఇటీవల ఆదేశించారు.

 ప్రైవేట్‌ ఫీజుల దోపిడీకి చెక్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటిం చేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఇటీవల ఆదేశించారు. ప్రతీ ప్రైవేటు పాఠశాల నోటీస్‌ బోర్డుపై తరగతుల వారీగా ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించ డంతో పాటు, పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లోనూ పూర్తి వివరా లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లి తండ్రుల బలహీనతను ఆసరాగా జేసుకుని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు యేటా అడ్డగోలుగా పోటాపోటీగా ఫీజులను పెంచుతూ పోతున్నారు. రకరకాల బోర్డులు తగిలించి విద్యార్థుల తల్లితండ్రులను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. ఫీజులు భారాన్ని భరిస్తూ ఒకరిని చూసి మరొకరు తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థి సంఘాల నాయకులు, తల్లితండ్రులు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుక వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. నీట్‌ పరీక్ష పత్రం లీకేజీపై కొత్తగా పుట్టుకువచ్చిన జెన్‌జీ, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ఉద్యమిస్తామని ఇటీవల సీజేపీ ప్రతినిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఫీజుల వివరాలను తరగతుల వారీగా నోటీస్‌ బోర్డుపై పెట్టాలని, విద్యాశాఖ పోర్టల్‌లో కూడా నమోదు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో 167 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో 35 వేల మందికి పైగా విద్యాభ్యాసం చేస్తున్నారు.

పోర్టల్‌లోనూ నమోదు తప్పనిసరి..

ఫీజుల వివరాలను టఛిజిౌౌజ్ఛూఛీఠ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ పోర్టల్‌లో నమోదు చేయాలని డైరెక్టర్‌ ఆదేశించారు. ఫీజుల నిర్ణయానికి సం బంధించిన పూర్తి పత్రాలను సైతం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలపై పాఠశాల గవర్నింగ్‌ బాడీ సభ్యుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. జీవోఎంఎస్‌ 1లోని రూల్‌ 16, 18 ప్రకారం ఫీజుల నిర్ణయ పత్రాలను సమర్పిం చాలని సూచించారు. దీంతో జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌, ధర్మారం, కాల్వశ్రీరాంపూర్‌, ఆయా మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్‌ పాఠశాలల యజమా నులు అమలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించే విధంగా జిల్లా, మండల విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు.

ఉల్లంఘిస్తే చర్యలు..

నోటీస్‌ బోర్డు, పాఠశాల వెబ్‌సైట్‌, విద్యాశాఖ పోర్టల్‌లో ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని విద్యాశాఖ డైరెక్టర్‌ హెచ్చరించారు. జీవోఎంఎస్‌ 1లోని రూల్‌ 11ను ఉల్లంఘించే పాఠశాలలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీజుల వివరాల ప్రదర్శన, పత్రాల అప్‌లోడ్‌, నిబంధనల అమలును జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవోలు), ప్రాంతీయ సంయుక్త విద్యా శాఖ అధికారులు (ఆర్జేడీలు) క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదే శించారు. ఫీజుల వివరాలను బహిరంగపర్చే విధంగా ఆదేశాలు జారీ చేయడాన్ని హర్షిస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు, విద్యా శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే ఉన్నందున ఫీజుల నియంత్రణకు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:25 AM