స్త్రీనిధి రుణాల మోసాలకు చెక్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:33 AM
స్వయం ఉపాధి చేసుకుంటూ జీవించే మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్‌పడింది. రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే డబ్బులు చెల్లించేం దుకు ప్రభుత్వం తీసుకవచ్చిన ‘మన స్త్రీ నిఽధి యాప్’ గురించి డీఆర్‌డీవో అధికారులు, సిబ్బంది, స్త్రీ నిధి బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్వయం ఉపాధి చేసుకుంటూ జీవించే మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్‌పడింది. రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే డబ్బులు చెల్లించేం దుకు ప్రభుత్వం తీసుకవచ్చిన ‘మన స్త్రీ నిఽధి యాప్’ గురించి డీఆర్‌డీవో అధికారులు, సిబ్బంది, స్త్రీ నిధి బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో 17,342 స్వశక్తి మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 4,912 మంది స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణాలు పొందారు. మహిళలచే పొదుపును ప్రోత్సహించడంతోపాటు ఉపాధి పనులు చేసుకునేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది. ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. వారు చేసే పొదుపు ఆధారంగా గత ప్రభుత్వాలు ఒక్కో సంఘానికి 10 వేల రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అందజేసి ప్రోత్సహించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా సంఘా లకు బ్యాంకు లింకేజీ ద్వారా జీరో వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇవేగాకుండా మైక్రో ఫైనాన్స్‌ల బారి నుంచి మహిళలను రక్షించేందుకు 2011లో ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో మహిళల చేత స్త్రీ నిధి బ్యాంకును ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు, సంఘ సభ్యులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. సంఘాలకు 10 లక్షల వరకు, సభ్యులకు 5 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాల పంపిణీలో, సభ్యులు తీసుకున్న వాయిదా సొమ్ము చెల్లింపులో కొంత కాలంగా అవకతవకలు జరుగుతు న్నాయి. కొందరు గ్రూపు లీడర్లు, వీఓఏలు ఆ డబ్బు లను సొంతంగా వాడుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆ భారమంతా రుణాలు పొందని సభ్యులు, రుణాలు పొందిన సభ్యులపై పడుతోంది. ఈ అవతవకలకు చెక్ పెట్టేందుకు మన స్త్రీ నిధి యాప్‌ను తీసుకవచ్చారు. ఈ యాప్ ద్వారా సభ్యులు పొందిన రుణాల వివరాలు, చెల్లించాల్సిన వాయిదాలు, ఎప్పుడు ఎంత చెల్లించారు, ఇంకా చెల్లిం చాల్సింది ఎంత అనే వివరాలు యాప్‌లో చూసుకునే విధంగా రూపొందించారు. రుణాలు పొందిన మహి ళలు గ్రూపు లీడర్ ద్వారానో, వీఓఏ ద్వారానో చెల్లిం చకుండా నేరుగా యాప్ ద్వారానే చెల్లించే వెసలుబాటు కల్పించారు. అవకతవకల నివారణకు తీసుక వచ్చిన యాప్ గురించి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 6,081 సంఘా లకు చెందిన 9,410 మంది సభ్యులు మన స్త్రీ నిధి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని స్త్రీ నిధి బ్యాంకు ఆర్‌ఎం దుర్గాప్రసాద్ తెలిపారు.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
మొదట గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మన స్త్రీనిధి తెలంగాణ అని టైప్ చేయాలి. ఆ తర్వాత ఇన్‌స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్‌స్టాల్ చేసే సమయంలో వచ్చే పర్మిషన్స్‌ను అన్నింటిని అలో చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 అప్షన్స్ కనిపిస్తాయి. సంఘం అకౌంటింగ్ అప్షన్ పైన క్లిక్ చేసి సంఘ సభ్యురాలి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తరువాత ఓటీపీ జనరేట్ అనే అప్షన్ పైన క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేయమని చూపించినట్లయితే మండలం స్త్రీ నిధి మేనే జర్‌ను సంప్రదించి, సంఘ సభ్యురాలి మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు స్త్రీనిధి యూట్యూబ్ ఛానల్ అయిన ‘స్త్రీ నిధి పేద మహిళల పెన్నిధి - తెలంగాణ’ ద్వారా వీడియో చూస్తూ స్త్రీనిధి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
మన స్త్రీనిధి యాప్ ద్వారా లాభాలు
మన స్త్రీనిధి యాప్‌లో పలు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. డీసీబీ రిపోర్టులు, సంఘం, సంఘ సభ్యుల వివరాలు, నివేదికలు, ఈఎంఐ క్యాలిక్యూలేటర్, చెల్లించిన రిపేమెంట్ సభ్యురాలి వారీగా సర్దుబాటు చేయుటకు వివరాలు ఇలా పలు రకాల ఆప్షన్స్ ఉంటాయి. డీసీబీ రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తే సంఘం డీసీబీ, సభ్యురాలి వారీగా డీసీబీ, సభ్యురాలి లోన్ లెడ్జర్, సంఘం లోన్ లెడ్జర్లు ఉంటాయి. వీటి ద్వారా సభ్యురాలి నెలవారీ చెల్లింపులు చూసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వాయిదాలు, అసలు, వడ్డీ, అప్పు నిల్వ, చెల్లించిన మొత్తం వివరాలు చూసుకోవచ్చు. యాప్ ద్వారా సంఘంలోని ప్రతి సభ్యురాలి వారీగా వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీనిధి రుణాల చెల్లింపులో పారదర్శకంగా సంఘ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుంది.