ముంపు గ్రామంగా చామనపల్లి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:16 PM
చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని వంద శాతం ముంపు గ్రామంగా ప్రకటించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం చామ నపల్లి గ్రామాన్ని కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లా డారు.
ధర్మారం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని వంద శాతం ముంపు గ్రామంగా ప్రకటించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం చామ నపల్లి గ్రామాన్ని కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లా డారు. మేడారంలో నంది రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినప్పటికి, చామనపల్లి గ్రామం ముంపును దృష్టిలో పెట్టుకొని, రిజ ర్వాయర్‌ను పూర్తిగా నింపలేక పోతున్నా మని తెలిపారు. కొన్నేళ్లుగా ఇళ్ళలోకి నీళ్లు చేరి, విష పురుగులతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎఫ్‌టీఎల్ తో పాటు 100 మీటర్ల మేరకు ముంపుగా పరిగణించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రితో మాట్లాడి వంద శాతం ముంపు గ్రామంగా ప్రకటించామని పేర్కొ న్నారు. గ్రామంలో ఎస్టిమేషన్ సర్వే చేసేం దుకు వివిధఽ శాఖలకు చెందిన అధికారులు వస్తారని, వారికి గ్రామస్తులు సహరిం చాలని కోరారు. 2022-23లో త్రీమెన్ కమిటీ నివేదిక ప్రకారం గ్రామంలో 140 ఇండ్ల వరకు ఆర్‌ఆండ్‌ఆర్ అవసరం ఉండదని తెలిపారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పదేళ్ళుగా ముంపు నీటితో గ్రామస్తులకు కలుగుతున్న ఇబ్బందులను తెలుపడం ద్వారా ప్రభుత్వానికి లేక రాశానని, మంత్రి అడ్లూరి ప్రతిపాదనతో ప్రభుత్వం వందశాతం ముంపు గ్రామంగా తీసుకొనేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం నుండి తమకు అధికారికంగా ఆర్ అండ్ కాలనీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. మూడు నాలుగు నెలల్లో ఆర్ అండ్ ఆర్ పక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుం టామని కలెక్టర్ అన్నారు. గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డుల ప్రకారం ఎనిమిటీ టీములు ప్రతీ ఇంటికి నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఉంటుందన్నారు. సర్పంచ్ వేల్పుల రేవతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, ఆర్టీవో గంగయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.