Share News

మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:45 AM

వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములుతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు26 (ఆంధ్రజ్యోతి): వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములుతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో చరిత్రలో నిలిచి, ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పేదలు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్‌, రజక సంఘ నాయకులు, అధికారులు, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళ చైతన్యానికి, ఆత్మగౌర వానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. పెత్తందారుల దురాగతాలను, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరా డారన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌, ఏఓ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు శేఖర్‌, సీసీ సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:45 AM