గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ తీసుకోవాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:30 PM
ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం రీజనల్ మెడికల్ ఆఫీసర్ కృపాభాయ్‌తో కలిసి హ్యూమన్ పాపిలోనా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కోల్‌సిటీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం రీజనల్ మెడికల్ ఆఫీసర్ కృపాభాయ్‌తో కలిసి హ్యూమన్ పాపిలోనా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లా డుతూ లక్షలాది మంది మహిళలు యేటా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతుండడంతో నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉచిత వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థినులకు వారి తల్లిదండ్రు లకు అవగాహన కల్పించి 14 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ బాలికకు వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు. మహిళా దినోత్సవం రోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, కార్పొరేటర్ సాగి సంతోష్‌రావు, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
పెద్దపల్లిటౌన్, (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్‌ను ఆదివారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలల వరకు జిల్లా ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్, రామగుండంలో అన్ని పని దినాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 14 ఏళ్ల వయసు గల బాలికలకు వ్యాక్సిన్ వేస్తారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, డీసీహెచ్‌ఎస్ డా. శ్రీధర్ మాట్లాడుతూ హెచ్‌పీవీ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సోకే గర్భాశయ క్యాన్సర్ కు ముఖ్య కారణమని, దీనివలన గర్భాశయ క్యాన్సర్ తీవ్రతను తగ్గించేం దుకు వ్యాక్సిన్ వేస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్ నాజ్ నియర్ అలీ, కౌన్సిలర్ కొట్టే స్వరూప, ప్రోగ్రాం అధికారులు డా. బి.కిరణ్‌కుమార్, డా. బి శ్రీరాములు, డా. కె.వి. సుధాకర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.