Share News

తెలంగాణపై కేంద్రం వివక్ష

ABN , Publish Date - May 14 , 2026 | 12:07 AM

బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌లకు అత్యధిక నిధులు ఇచ్చి, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం పెద్దపల్లి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అత్యధిక పన్ను తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే రాష్ట్రానికి మాత్రం ఇస్తున్న నిధుల్లో అన్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష

పెద్దపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌లకు అత్యధిక నిధులు ఇచ్చి, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం పెద్దపల్లి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అత్యధిక పన్ను తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే రాష్ట్రానికి మాత్రం ఇస్తున్న నిధుల్లో అన్యాయం జరుగుతుందన్నారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వ్యతిరేకించామని, తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్‌ ఆంధ్రకు తరలించారన్నారు. ఇటీవల్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రేపిస్టులకు విడుదలైన ఖైదీలకు టికెట్లు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం గెలిపించుకుందన్నారు. రామగుండం యూరియా ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తూ యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు. అమెరికా నుంచి ఆదేశాలు వస్తేనే మోదీ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ విషయంలో ట్విట్టర్‌ టిల్లు కేటీఆర్‌ లేనిపోని రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేటీఆర్‌ హీరోయిన్ల కాపురాలు కూల్చాడని విమర్శించారు. బండి భగీరథ్‌ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎంపీ అన్నారు.

మంచిర్యాల జిల్లా ధాన్యం రాకుండా కలెక్టర్‌ వివక్ష..

పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల టన్నుల ధాన్యం సామర్థ్యం గల మిల్లులు ఉన్నాయని, మంచిర్యాల జిల్లాలో 60 వేల టన్నుల సామర్థ్యం గల మిల్లులు మాత్రమే ఉన్నాయని, మిగులు ధాన్యాన్ని ప్రతి సీజన్‌లో పెద్దపల్లి జిల్లాకు పంపిస్తారని, ఈసారి ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లాలోని రైస్‌మిల్లులకు రాకుండా కలెక్టర్‌ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. రైతుల గోసా మీకు పట్టదా, రైతులను చంపాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజల కోసం బరాబర్‌ ప్రశ్నిస్తానని, అధికారంలో ఉన్నా, లేకున్నా ఎంతకైనా సిద్ధమేనని అన్నారు. అధికారులు రాజకీయాలు చేయొద్దని, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని హితవు పలికారు. రైతుల పక్షాన ప్రశ్నిద్దామని ఇక్కడికి వచ్చానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సజ్జద్‌, బండారి సునీల్‌, అడ్డకుంట శ్రీనివాస్‌, గుండేటి అయిలయ్య యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:07 AM