సీసీ కెమెరాలు.. రక్షణ నేత్రాలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:27 PM
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామానికి రక్షణ నేత్రాలుగా ఉపయోగపడుతాయని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ అన్నారు. సోమవారం తుర్కలమద్దికుంట పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 15 (ఆంఽధ్రజ్యోతి) : ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామానికి రక్షణ నేత్రాలుగా ఉపయోగపడుతాయని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ అన్నారు. సోమవారం తుర్కలమద్దికుంట పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు. గ్రామ పాలకవర్గాలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాలు జరిగినప్పుడు కెమెరాల ద్వారా గుర్తించడం సులభమవుతుందన్నారు. వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ గోగు రాజయ్య, సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ శ్వేత, ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులు ముత్యాల నరేష్, స్వామిరాజ్, తో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.