Share News

చెరువులు, కుంటల తూములు తెరిస్తే కేసులు

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:20 PM

సూపర్‌ ఎల్‌నినో దృష్ట్యా యాసంగిలో వరిసాగు చేయొ ద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా రైతులు పట్టించు కోవడం లేదని, చెరువులు, కుంటల తూములను ఎవరైనా తెరిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అధికా రులను ఆదేశించారు.

చెరువులు, కుంటల తూములు తెరిస్తే కేసులు

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : సూపర్‌ ఎల్‌నినో దృష్ట్యా యాసంగిలో వరిసాగు చేయొ ద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా రైతులు పట్టించు కోవడం లేదని, చెరువులు, కుంటల తూములను ఎవరైనా తెరిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అధికా రులను ఆదేశించారు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల సర్పంచ్‌లు, అధికారులతో శుక్రవారం మున్సి పాలిటి సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న యాసంగి పంటల్లో 12 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని, ఎస్సారెస్పీ కింద ఆధార పడిన రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. యాసంగిలో కాలువ నీరు రావని, రైతులు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు, శనగ వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతి నిధులు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రారంభమైందన్నారు. సర్పంచ్‌లు సెం టర్‌లు సందర్శించి 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరా కుటుం బ బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు. తహసీ ల్దార్‌ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మన్‌లు ముత్యాల నరేష్‌, చింతపండు సంపత్‌ తో పాటు గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

ఏవో నాగార్జునపై ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ మండల అధికారి నాగార్జున ప్రగతి నివేదిక తెలుపుతుండగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు ప్రశ్నల వర్షం కురిపించారు. మం డలంలో సాగు విస్తీర్ణం ఎంత ఉంది, ఎల్‌నినో దృష్ట్యా ఆరుతడి పంటలపై అవగాహన కల్పిం చారా? అని ఏవోను ప్రశ్నించడంతో పాటు సర్పం చ్‌లను అడిగారు. వ్యవసాయ అధికారులు సమా వేశాలు నిర్వహించలేదని సర్పంచ్‌లు తెలిపారు. దీంతో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వరి పంటలు వద్దు అని చెబుతున్నా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమా షాలు చేస్తే ఊరుకునేది లేదు... కాదంటే సెలవులో ఉండాలని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా పని తీరు మార్చుకొని మండల వ్యాప్తంగా వ్యవసాయాధి కారులు పర్యటించి అవగాహన కల్పించి, ఆరుతడి పంటలు సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - Nov 20 , 2026 | 11:20 PM