Share News

అభ్యర్థులు ఎన్నికల నియామవళి పాటించాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:46 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని కచ్చితంగా పాటించాలని రామగుండం నగర పాల క కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ తెలిపారు. బుధవారం కార్పొరేషన్‌ బరిలో నిలిచిన అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయకళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.

అభ్యర్థులు ఎన్నికల నియామవళి పాటించాలి

జ్యోతినగర్‌, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని కచ్చితంగా పాటించాలని రామగుండం నగర పాల క కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ తెలిపారు. బుధవారం కార్పొరేషన్‌ బరిలో నిలిచిన అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయకళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ను అందజేశారు. సందేహాల నివృతి ్తకోసం అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులను, రామగుండం నగర పాలకసంస్థలోని ఎలక్షన్‌ సెల్‌ను సంప్రదించాలన్నారు. ప్రచార వాహనాలకు కార్పొరేషన్‌ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల వ్యయపరిమితి రూ.1.50లక్షలకు మించ రాదని, ఎన్నికల అనుమతి పత్రం వాహనాలకు అంటించాలని, ఎన్నికల కమిషన్‌ నిర్దేశిత రేట్ల ప్రకారం లెక్కల వ్యయం ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచా రం నిర్వహించుకోవాలని ఏసీపీ రమేష్‌ తెలిపారు. పోలీసులకు తమవంతు సహ కారం అందించాలని కోరారు. మైకులు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించుకోవడానికి మీ సేవ సెంటర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ర్యాలీలకు కూడా పోలీ సులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల కోడ్‌ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే నగర పాలక సంస్థకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. శిక్షకులు స్వరూప్‌ చంద్‌, శ్రీనివాస్‌లు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎన్నికల పరిశీలకులు పద్మజారాణి, వ్యవ పరిశీలకులు సుజాత, కృష్ణమోహన్‌, రవిబాబు, నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:46 PM