క్యాన్సర్ ప్రమాదకరంగా మారింది
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:40 PM
దేశంలో క్యాన్సర్ మహమ్మారి విస్తరించి ప్రమాదకరంగా మారుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీని నివారణకు గ్రామస్థాయిలో ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
ఓదెల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో క్యాన్సర్ మహమ్మారి విస్తరించి ప్రమాదకరంగా మారుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీని నివారణకు గ్రామస్థాయిలో ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కనగర్తిలో సోమవారం సీపీఐ నాయకుడు తాళ్లపల్లి రమేష్ సంస్మరణ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ చెడు అలవాట్లు లేని వారికీ సైతం క్యాన్సర్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు శాసనసభ బడ్జెట్‌తో పోటీపడే స్థాయిలో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ఒక వ్యక్తి వైఫల్యం కారణం కాదని, పూర్తిగా వ్యవస్థ వైఫల్యమే కారణమని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాల నివారణకు పోలీసు యంత్రాంగంతో పాటు యువత, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి, సీపీఐ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్, కన్నం లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ గంట రాములు, బోయిని అశోక్, మాజీ ఎంపీపీ పాల రామారావు, ఆది మధుసూదన్‌రావు, చొప్పరి రాజయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, గుంటి వేణు, ఆడెపు రాజమౌళి, తాళ్లపల్లి లక్ష్మణ్, మల్లయ్య, శంకరయ్య, పాల్గొన్నారు.