Share News

పది రోజుల్లో క్యాత్‌ల్యాబ్‌ను పూర్తిచేయాలి

ABN , Publish Date - May 02 , 2026 | 11:36 PM

వారం పది రోజుల్లో క్యాత్‌ల్యాబ్‌ను పూర్తిచేసి రామగుండం ప్రాంతవాసులకు, సింగరేణి కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని డైరెక్టర్‌ (ఆపరేషన్‌) ఏఎల్‌వీ సూర్యనారా యణ అన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్‌ లో ఏర్పాటు చేసిన క్యాత్‌ల్యాబ్‌ను శనివారం ఆయన పరిశీలించారు.

పది రోజుల్లో క్యాత్‌ల్యాబ్‌ను పూర్తిచేయాలి

గోదావరిఖని, మే 2 (ఆంధ్రజ్యోతి): వారం పది రోజుల్లో క్యాత్‌ల్యాబ్‌ను పూర్తిచేసి రామగుండం ప్రాంతవాసులకు, సింగరేణి కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని డైరెక్టర్‌ (ఆపరేషన్‌) ఏఎల్‌వీ సూర్యనారా యణ అన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్‌ లో ఏర్పాటు చేసిన క్యాత్‌ల్యాబ్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సీఎంఓ డాక్టర్‌ కిరణ్‌ సారథ్యంలో డైరెక్టర్‌ క్యాత్‌ ల్యాబ్‌ను పురోగతి ని పర్యవేక్షించారు. క్యాత్‌ ల్యాబ్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ గుండె సం బంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు ఉపయో గించే అధునాతన విభాగమన్నారు. తీవ్రమైన గుండె సమస్యలు వస్తే కార్మికులు, స్థానికులు హైదరాబాద్‌ ఇతర నగరాలకు వెళ్లాల్సి వస్తుందని, ఈ క్రమంలో సమయం వృథా అయ్యేదని, ఇప్పుడు స్థానికంగానే చికిత్స అందు తుందన్నారు.

సింగరేణి కార్మికులకు, వారి పై ఆధారపడిన వారికి పైసా ఖర్చు లేకుండా కార్పొ రేట్‌ స్థాయి వైద్యం అందుతుందని తెలిపారు. రెనే హాస్పిటల్‌ ఆధ్వర్యంలో అధునాతన యంత్రాలు ల్యాబ్‌లో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇమేజింగ్‌ మిషన్ల ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపా రు. సివిల్‌ పనులు, మెషినరీ ఇన్‌స్ట్టాలేషన్‌ వేగంగా జరుగుతు న్నాయని, పది రోజుల్లో పూర్తిచేసి ప్రారంభిస్తామని తెలిపారు. గుండె వైద్య నిపుణులు అందుబాటులోకి రావడం వల్ల రామగుండం ఏరి యా హాస్పిటల్‌ కేవలం సాధారణ వైద్యానికే కాకుండా, సూపర్‌ స్పెషాలిటీ సేవల కేంద్రంగా మారుతుందని తెలిపారు. హాస్పిటల్‌ ఏసీఎంఓ డాక్టర్‌ బీ అంబికా, ఆర్‌జీ-2 జీఎం బండి వెంకటయ్య, డీవైసీఎంఓ ప్రసన్నకుమార్‌, డాక్టర్‌ మద్దిలేటి, వర్క్‌షాప్‌ ఇంజనీర్‌ నారా యణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:36 PM