బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:05 AM
రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం బస్సులు లేక గోదావరరిఖని బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రద్దీకి అనుగుణంగా అధికారు లు చర్యలు చేపట్టకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది.
కళ్యాణ్‌నగర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం బస్సులు లేక గోదావరరిఖని బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రద్దీకి అనుగుణంగా అధికారు లు చర్యలు చేపట్టకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం నుంచే గోదావరిఖని బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది. సొంత ఊళ్లకు వెళ్లేవారు సమయానికి బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. ఫ్లాట్‌ఫాంలన్నీ ప్రయా ణికులతో కిక్కిరిసిపోయాయి. వచ్చిన బస్సుల కోసం పరుగులు తీశారు. కరీంన గర్, హైదరాబాద్, భూపాలపల్లి, వరంగల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఓడెడ్, ఆసిఫాబాద్, ధర్మారం రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నిరీక్షించారు. శుక్ర వారం ఉదయం నుంచే బస్టాండ్‌తో పాటు రాజేష్ థియేటర్, చౌరస్తా, ఏరియా ఆసుపత్రి, ఫైవింక్లయిన్, ఎన్‌టీపీసీ, బీపవర్‌హౌస్ గడ్డ వద్ద బస్సుల కోసం పడిగాపులు కాశారు. ఇదే అద నుగా భావించి ప్రైవేట్ వాహనాలు ఆటోలు, కార్ల యజమానులు డబుల్‌రేటును వసూలు చేశారు. గోదావరిఖని ఆర్‌టీసీ డిపోకు 10 మెట్రో డిలాక్స్‌లను స్పెషల్ పేర కరీంనగర్, మంచిర్యాల, భూపాలపల్లి రూట్లలో నడిపిం చినా అవి కూడా కిటకిటలాడాయి. ఆర్‌టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా బస్సులు నడపక పోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.