Share News

రోడ్డెక్కిన బస్సులు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:13 PM

ఆర్‌టీసీ ఉద్యో గులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను విర మిం చారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో బస్సులు రోడ్డెక్కాయి. గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో ఉదయం 3గంటలకు మొదటి సర్వీసు ప్రారంభ మైంది.

రోడ్డెక్కిన బస్సులు

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీ ఉద్యో గులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను విర మిం చారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో బస్సులు రోడ్డెక్కాయి. గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో ఉదయం 3గంటలకు మొదటి సర్వీసు ప్రారంభ మైంది. మూడు రోజులుగా ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బంది పడగా శనివారం గోదావరిఖని బస్టాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆర్‌టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంతో ఆర్‌టీసీ డిపో ఎదుట జేఏసీ చైర్మన్‌ వంగర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వివేక్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఆర్‌టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు తీర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:13 PM