Share News

రెండవ రోజు రోడ్డెక్కని బస్సులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:07 AM

ఆర్టీసీలో రెండవ రోజు గురువారం సమ్మె విజ యవంతమైంది. తమ సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. గురువారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి.

రెండవ రోజు రోడ్డెక్కని బస్సులు

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో రెండవ రోజు గురువారం సమ్మె విజ యవంతమైంది. తమ సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. గురువారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌ వెలవెలబోయింది. ఆర్‌టీసీ డిపో ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి యాజ మాన్యం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను పిలి చినప్పటికీ పెద్దగా స్పందనలేదు. ఉద్యోగానికి వస్తే కార్మికులు ఎక్కడ దాడి చేస్తారనే భయంతో ప్రైవేట్‌ వ్యక్తులు డిపో దరిదాపులకు రాలేదు. దీంతో యాజమాన్యం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో నుంచి మూడు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కరీంనగర్‌కు నడపడానికి ప్రయ త్నం చేసినప్పటికీ అవి కూడా విఫలమ య్యాయి. కరీంనగర్‌ నుంచి మంచిర్యాల వరకు ఎలక్ర్టికల్‌ బస్సులను నడపడంతో కొంత ప్రయాణికులకు ఊరట కలుగగా హైద రాబాద్‌ భూపాలపల్లి, వరంగల్‌, విజయవాడ, నెల్లూరు వంటి నగరాలకు బస్సులు నడవడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్లా ల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆర్‌టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాల మాహానాడు నాయ కులు మాలెం మధు ఆధ్వర్యంలో ఆర్‌టీసీ డిపో వద్ద మద్దతు ప్రకటించారు. ఆర్‌టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వెంటనే మంత్రి స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నంది నరేష్‌, కడమండ శ్రీహరి, మొండి, గుమ్మడి పెద్దులు పాల్గొన్నారు.

వినూత్నంగా కార్మికుల నిరసన...

గోదావరిఖని డిపో ఎదుట ఆర్‌టీసీ ఉద్యో గులు మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమా న్ని చేపట్టారు. అద్దె బస్సుల యజమానులు బస్సులు నడపద్దంటూ వేడుకున్నారు. బస్సు లు నడిపి మా పొట్ట కొట్టవద్దంటూ, రేపు మీకు ఇదే జరుగుతుందంటూ నినాదాలు చేశా రు. గోదావరిఖని డిపోలో 90ఆర్‌టీసీ బస్సులు, 50 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సులు కూడా రెండు మూడు తప్ప బయటకు రాలే దు. డిపో ఎదుట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వన్‌టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. సమ్మెతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌టీసీ జేఏసీ కమిటీ చైర్మన్‌, వంగర శ్రీనివాస్‌, తిరుపతి, సామ్యుల్‌, ఇందిరా రాణి, సులోచన, రజిత, స్వప్న, శ్రీలత, లక్ష్మి, రాణి, శ్రీనివాస్‌, కార్తీక్‌, నాగరాజు, చారి, తిరుమల, మంజుల పాల్గొన్నారు.

రెండో రోజు సమ్మెలో ఆర్టీసీ కార్మికులు

మంథని, (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం మంథని డిపో ఆర్టీసీ కార్మికులు గురువారం రెండో రోజు సమ్మెలో పాల్గొన్నారు. డిపో, బస్టాండ్‌ వద్ద ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. డిపో పరిధిలోని 24 అద్దె బస్సులను గోదావరిఖని, కరీంనగర్‌, భూపాలపల్లి తోపాటు ఇతర రూట్లలో నడిపినట్లు డీఎం శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. సమ్మె కారణంగా డిపో, బస్టాండ్‌ను డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ మడత రమేష్‌లు సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమ్మెలో జేఏసీ చైర్మన్‌ కేకే రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఐలయ్య, నేతలు ఖాదర్‌, గంధం రమేష్‌, ఖుతుబోద్దీన్‌, జనార్ధన్‌, సదయ్య, పోచయ్య, జేడీ నాయక్‌, ఇంతియాజ్‌బేగం, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:07 AM