అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:48 PM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచపోయాయి.
భగత్‌నగర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచపోయాయి. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా 11 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోల కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసులు ప్రభుత్వానికి అందజేశారు. 31 డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం ముందు ఉంచడంతో ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిచింది. మంగళవారం రాత్రి వరకు సాగిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచి సమ్మె అనివార్యమైంది.
ఫ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరంగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు అన్నారు. రీజియన్ వ్యాప్తంగా 333 అద్దె బస్సులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడుస్తాయన్నారు. ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తామన్నారు. సంస్థ పరంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.