Share News

ప్రయాణికులతో కిటకిటలాడిన ఖని బస్టాండ్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:51 PM

శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ఆది వారం గోదావరి ఖని బస్టాండ్‌ ప్రయాణికులతో కిట కిటలాడింది. సమయానికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసింది.

ప్రయాణికులతో కిటకిటలాడిన ఖని బస్టాండ్‌

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ఆది వారం గోదావరి ఖని బస్టాండ్‌ ప్రయాణికులతో కిట కిటలాడింది. సమయానికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడం, పెళ్ళిళ్లు ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయా ణికులు సమయానికి బస్సులు రాక బస్టాండ్‌లో ఇబ్బందులు పడ్డారు. వచ్చిన బస్సులో సీట్ల కోసం పోటీపడ్డారు. చాలా రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించారు.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల రద్దు

వివిధ రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లను రద్దు చేశారు. కరీంనగర్‌, గోదావరిఖని రూట్లలో రాత్రి తొమ్మిది గంటలు దాటితే బస్సులు ఉండడం లేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చే సర్వీసులే ఉంటున్నాయి. భూపాలపల్లి నుంచి రాత్రి 8గంటలకు మణుగూరు బస్సు గోదావరిఖనికి చివరి బస్సు కావటంతో భూపా లపల్లికి సింగరేణి గనులకు వెళ్లే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు మిస్‌ అవుతే ప్రైవేట్‌ వాహనాలు ఆశ్రయించవలసి వస్తుంది. ఇటీవల గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు ఆరు సర్వీసులు రద్దు చేశారు. ప్రయాణికులు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతు న్నారు. పండుగలు పెళ్ళిల సీజన్‌లో బస్సులు తగ్గిం చడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:51 PM