బీఆర్‌ఎస్ నాయకులది మేకపోతు గాంభీర్యం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:03 AM
బీఆర్‌ఎస్ నాయకులు ఆక్రమించిన భూములను బయటపెడుతుంటే లోపల గుబులు చెందుతూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పాడి పశువులు, జీవా లకు బీమా సౌకర్యం కల్పించడంపై అఖిల భార త యాదవ సంఘం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి, చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.
ధర్మారం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నాయకులు ఆక్రమించిన భూములను బయటపెడుతుంటే లోపల గుబులు చెందుతూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పాడి పశువులు, జీవా లకు బీమా సౌకర్యం కల్పించడంపై అఖిల భార త యాదవ సంఘం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి, చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. పేదలకు చెందాల్సిన కోట్లాది రూపాయల అసైండ్, ఇనాం భూములను తీసుకుని బీఆర్ ఎస్ కుటుంబ పాలకులు విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లను నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో బుధవారం సిరిసిల్లలో పార్ట్ 1 విడుదల చేశామని, పార్ట్ 2గా సిద్దిపేట హారీష్‌రావు బాగోతం, మేన్ ఫిక్షర్ గజ్వెల్‌లో విడుదల కాబోతుందన్నారు. ఈ మూడు పార్టు ల్లో వారి అవినీతి ఆక్రమాలపై రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని అవినీతికి పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పాల్పడ్డా రని పేర్కొన్నారు. వీరి అవినీతిని సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో బయట పెడితే ఏ ఒక్కరు సమాధానం చెప్పకుండా, పోకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని తెలిపారు. యాదవ సంఘ మండల అధ్యక్షుడు ధ్యాగేటి ఉదయ్, గొల్ల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు జంగ మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంగ రంజిత్, మేడారం సర్పంచ్ వీర్‌పాల్, కాంగ్రెస్ నాయకులు వేల్పుల నాగరాజు, నర్సింహులపల్లి సర్పంచ్ ఆవుల మల్లయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.