సింగరేణిని భ్రష్టుపట్టించిన బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:49 PM
సింగరేణిలో అవినీతి, కుంభకో ణాలకు కారణం బీఆర్‌ఎస్సేనని రామగుండం నగర మేయర్ మహం కాళి స్వామి బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు సింగరేణిని దోచుకున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ హఠావో అనే నినాదంతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి కాంగ్రెస్‌ను కార్మికులే అధికారంలోకి తీసుకువచ్చాన్నారు.
కోల్‌సిటీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో అవినీతి, కుంభకో ణాలకు కారణం బీఆర్‌ఎస్సేనని రామగుండం నగర మేయర్ మహం కాళి స్వామి బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు సింగరేణిని దోచుకున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ హఠావో అనే నినాదంతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి కాంగ్రెస్‌ను కార్మికులే అధికారంలోకి తీసుకువచ్చాన్నారు. సింగరేణి జైపూర్ పవర్‌ప్లాంట్‌కు రావాల్సిన రూ.30వేల కోట్లను అప్పటి ప్రభు త్వం ఎందుకు చెల్లించలేదన్నారు. సింగరేణిలో జరిగిన క్లరికల్ పోస్టుల ప్రశ్నాపత్రాలు లీకైతే మాజీ మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఎందుకు మాట్లాడలేదని, మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్‌లో కార్మి కుల నుంచి రూ.6లక్షల నుంచి రూ.15లక్షలు దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో శ్రీరాంపూర్‌లో ఒకే ఇంటిలో ముగ్గురికి క్లర్క్ ఉద్యోగాలు ఎలా వచ్చాయని, ఆ ముగ్గురు జాగృతి నాయకురాలు కవితకు చెందిన వారని, దీనిపై మాజీ మంత్రులు ఎందుకు స్పందించలేదన్నారు. సింగరేణి కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాజీ మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ సదస్సు పేరుతో మోసం చేయడానికి వస్తున్నారని, దీనిని కార్మికులు నమ్మవద్దని కోరారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కుంభకోణంలో మంత్రి సిఫార్సుతో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్యోగాల కుంభకో ణంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదని, ఆర్‌ఎఫ్‌సీఎల్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు కొప్పుల ఈశ్వర్ సిఫార్సు లెటర్లు పంపింది అధికారులే బయట పెట్టారని చెప్పారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, తాళ్లపల్లి యుగంధర్, అల్లి శంకర్ పాల్గొన్నారు.
డివిజన్లలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
రామగుండం కార్పొరేషన్‌లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించ డమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శుక్రవారం చైతన్యపురి కాలనీలో పర్యటించారు. కాలనీలో మురుగు నీరు బయటకు వెళ్ళకపోవడంతో మేయర్ నాలాను తవ్విం చారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ రిక్షా కాలనీకి రోడ్డు, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సహకారంతో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయించి ఇండ్ల పట్టాలు ఇప్పించామన్నారు. కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, చిదురాల నాగరాజు, వడ్లూరి రవి, నాయకులు కన్నూరి శంకర్, కందుల సతీష్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈ మీర్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, మెప్మా సీఓ శ్వేత పాల్గొన్నారు.