విద్యార్థుల ఆకలి తీర్చేందుకే అల్పాహారం
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:27 AM
పెద్దపల్లి నియోజక వర్గం ఎలిగేడు మండలం రాములపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠ శాలలో మంగళవారం విద్యార్థులకు అల్పాహారం అందించారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజక వర్గం ఎలిగేడు మండలం రాములపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠ శాలలో మంగళవారం విద్యార్థులకు అల్పాహారం అందించారు. విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. విద్యార్థులు పాఠశాలకు ఉదయం 9 గంటలకే హాజరవుతారని, తల్లితండ్రులు 7 గంటలలోపే పనులకు వెళుతుండడంతో విద్యార్థులకు అల్పాహారం, పాలు పంపిణీ చేపట్టారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.65 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించామన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ బంగారి రమేష్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజన వేన సదయ్య, తహసీల్దార్ రావెల్లి రాముడు, ఎంఈఓ సిరిమల్ల మహేష్, ఎంపీడీవో సురేందర్ పాల్గొన్నారు.