Share News

అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:42 PM

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని , రక్తదానం చేయడం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అమర్‌ చంద్‌ కళ్యాణ మండపంలో పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు.

అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది

పెద్దపల్లి రూరల్‌ , అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని , రక్తదానం చేయడం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అమర్‌ చంద్‌ కళ్యాణ మండపంలో పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. డీసీపీ రాంరెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది 50, మంది ఇతరులు మొత్తం 350 మంది రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. రంగాపూర్‌ గ్రామానికి చెందిన సముద్రాల రాజ్‌కుమార్‌ గౌడ్‌ ఇప్పటివరకు 104 సార్లు రక్తదానం చేయగా అతనిని డీసీపీ, సీఐ అభినందించారు. ట్రాఫిక్‌ సీఐ, పెద్దపల్లి ఎస్‌ఐలు రాజశేఖర్‌, నరేష్‌, మధూకర్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ జిల్లా అధ్యక్షుడు ఎరబాటి వెంకటేశ్వర్‌, రాష్ట్ర సభ్యులు కావేటి రాజగోపాల్‌, సంపత్‌రావు, శ్రీకాంత్‌, రమేష్‌, సంపత్‌ తో పాటు రక్తదాతలు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:42 PM