Share News

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రేపు బీజేపీ నిరసనలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:00 AM

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కార్యకర్తలను సన్నద్ధం చేసేం దుకు మంగళవారం పొత్కపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రేపు బీజేపీ నిరసనలు

ఓదెల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కార్యకర్తలను సన్నద్ధం చేసేం దుకు మంగళవారం పొత్కపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుమేరకు రైతులు ఎదుర్కొం టున్న విద్యుత్‌ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పట్టణాలు, మండ లాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. విద్యుత్‌ కోతలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలు కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌ డిమాండ్‌ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతులకు నిరం తరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, ధాన్యానికి గిట్టుబాటు ధర, సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్‌ స్టేషన్లు, ఏఈ, డీఈ కార్యాలయాలను ముట్టడిస్తూ, ధర్నాలు, రాస్తారోకోలతో పాటు సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పుల్లూరి పృథ్వీరాజ్‌, అనిల్‌ రావు మ్యాడగోని రమేష్‌, కొంగరి అనిల్‌,శనిగరపు రవీందర్‌,చర్లపల్లి రాజు,కుక్కల మహేందర్‌, సదన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:00 AM