Share News

మహిళా బిల్లును అడ్డుకోవడంపై బీజేపీ ఆందోళన

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:05 AM

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓటు వేయడాన్ని నిరసిస్తూ శనివారం గోదావరిఖని చౌరస్తాలో బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

మహిళా బిల్లును అడ్డుకోవడంపై బీజేపీ ఆందోళన

గోదావరిఖని, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓటు వేయడాన్ని నిరసిస్తూ శనివారం గోదావరిఖని చౌరస్తాలో బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకురాళ్లు బల్మూరి వనిత, కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహిళల హక్కులను, సాధికారితకు విరుద్ధంగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారని, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రధాని మోదీ బిల్లును తీసుకువస్తే దానిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై తిరుగుబాటు రోజులు మొదలయ్యాయని, ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బిల్లును మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరారు. మహిళల హక్కులను అడ్డుకోవడం సరైంది కాదని, ఇప్పటికైనా ఇండియా కూటమి కళ్లు తెరిచి బిల్లుకు వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా మద్దతు తెలుపాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం...

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గోదావరిఖని చౌరస్తాలో బీజేపీ మహిళా నాయకురాళ్లు చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయడానికి తీసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను లాక్కునేందుకు ప్రయత్నించగా పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయడానికి తీసుకెళ్లారు. పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ నిరసనలో సుల్వ పద్మ, చిలుక భారతి, అపర్ణ, సరిత, పద్మ, సరోజన, రాజేశ్వరి, రాజవ్వ, మంగ, రజిత, సంపూర్ణ, సుస్మిత, సుమలత, సుప్రియ, ఈశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:05 AM