Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:32 PM

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షల నిర్వహణ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై సమీక్షించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

సుల్తానాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షల నిర్వహణ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు నిర్దేశించిన సమయానికి హాజరై, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని, రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి ఆవరణ, రోగుల వేచిచూసే ప్రదేశాలు, వైద్య పరీక్షల గదులు, వార్డులు, శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తొలగించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులతో వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. రోగుల సమస్యలను ఓపికగా విని, వారికి అందించే వైద్య సేవల గురించి వివరించాలని తెలిపారు. రోగులకు వైద్య సేవల విషయంలో సరైన సమాచారం అందిస్తూ, వారిపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:32 PM