Share News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:33 AM

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి

పెద్దపల్లిటౌన్‌, జనవరి 5 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఏఎన్‌ఏం రిజిస్ట్రేషన్‌ నుంచి టీకాలు వేయించడం, రెగ్యులర్‌ చెకప్‌, ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగేలా చూడాలని తెలిపారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు రెగ్యులర్‌గా పాఠశాలలను తనిఖీ చేస్తూ పిల్లలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. మార్చి నెలాఖరు వరకు వంద శాతం ఎన్‌సిడి సర్వే పూర్తి చేయాలని, మధుమేహం, బీపీ ఉన్నవారికి మందులు రెగ్యులర్‌ గా అందించాలని సూచించారు. జిల్లాలో పాజిటివ్‌గా తేలిన టీబీ కేసుల వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్‌ కిట్‌, అవసరమైన చికిత్స అందేలా చూడాలన్నారు. పీహెచ్‌ సీలో మరమ్మతులో ఉన్న వైద్య పరికరాలను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమ లు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో యూరియా, యాసంగి సాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్‌ 8 వరకు 7 తడులలో యాసంగి పంటకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల అవుతుందని, 8 రోజుల పాటు జగిత్యాల, 7 రోజుల పాటు పెద్దపెల్లి జిల్లాకు సాగు నీరు అందుబాటులో ఉంటుందన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చూడాలన్నారు. రైతులు ప్రత్యా మ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌, డివిజనల్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:33 AM