ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:16 AM
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్‌టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.
కళ్యాణ్‌నగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్‌టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. గోదా వరిఖని బస్టాండ్ నుంచి వేలాది మంది ప్రయాణికులు ప్రయాణి స్తారని, వారికి మంచినీటిని, వాష్‌రూమ్‌లను, ఫుట్‌పాత్‌లను పరిశు భ్రంగా ఉంచాలని సూచించారు. బస్టాండ్‌లో చేపడుతున్న ప్లాట్‌ఫాంల విస్తరణ, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. బస్టాండ్ ఎదుట గార్డెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లకు మంచినీటి సౌక ర్యం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరలోనే చేపడుతామన్నారు. బస్టాండ్ వద్ద ఆటోస్టాండ్‌ను, డ్రైవర్లకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు సాగి సంతోష్‌రావు, నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, ఎస్‌ఓ వీరారెడ్డి ఉన్నారు.