సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:04 AM
ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పాలక మండల సమావేశం జరిగింది.
సుల్తానాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పాలక మండల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాట్లాడుతు అధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు. ముఖ్యంగా పట్టణంలో పారిఽశుధ్యం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కమిషనర్‌తో సహా అందరూ పర్యవేక్షించాలని, కౌన్సిలర్లు వార్డు సందర్శనల కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పలు వార్డుల్లో విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఏఈని అదేశించారు. పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, గతంలో మంజూరైన లబ్ధిదారులు తమ ఇండ్లను వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. మంచినీటి పథకం నిర్వహణ సక్రమంగా చేయాలని, అమృత్ పథకంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ను తొందరగా పూర్తి చేయాలన్నారు. స్వశక్తి సంఘ మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, కమిషనర్ టి రమేష్, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, గాజుల రాజమల్లు, కందునూరి సమత, గరిగె శోభారాణి, బాకం సాయికిరణ్, ఊట్ల వరప్రదీప్, చింతల రాజు, టీకే ప్రభాకర్, కల్వల శంకరమ్మ, సిద్ద తిరుపతి, వేగళం పద్మ,గాదాసు మంజుల పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.