Share News

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 15 , 2026 | 11:36 PM

బక్రీద్‌ పండుగను పురస్కరిం చుకుని పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవా రం దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రాముగుండం సీపీ తనిఖీ చేశారు.

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

సుల్తానాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగను పురస్కరిం చుకుని పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవా రం దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రాముగుండం సీపీ తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద ఉన్న అధికా రులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాల తనిఖీకి సంబం ధించిన రిజిష్టర్‌ను పరిశీలించారు. సీపీ మాట్లాడుతు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కమిషనరేట్‌ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు తెలిపారు.

ప్రతీ వాహనం, వశువుల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని, రవాణాకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 27 బక్రీద్‌ పండగ సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానా బాద్‌ సీఐ రంజిత్‌ రావు,ఎస్‌ఐ చంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:37 PM