Share News

సమస్యల పరిష్కారానికి సమ్మెకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - May 04 , 2026 | 12:05 AM

సిం గరేణి సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉండా లని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షుడు సీతారామయ్య పిలుపు నిచ్చారు. గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన సమావేశంలో జనరల్‌ సెక్రెటరీ రాజ్‌కుమార్‌తో కలసి ఆయన మాట్లాడారు. ఈనెల రెండవ వారంలో యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ ఇవ్వను న్నట్టు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి సమ్మెకు సిద్ధంగా ఉండాలి

గోదావరిఖని, మే 3(ఆంధ్రజ్యోతి): సిం గరేణి సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉండా లని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షుడు సీతారామయ్య పిలుపు నిచ్చారు. గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన సమావేశంలో జనరల్‌ సెక్రెటరీ రాజ్‌కుమార్‌తో కలసి ఆయన మాట్లాడారు. ఈనెల రెండవ వారంలో యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ ఇవ్వను న్నట్టు తెలిపారు. గుర్తింపు సంఘం హోదాలో కార్మికుల పెండింగ్‌ సమస్యల ను పరిష్కరించాలని యాజమాన్యాన్ని పలు సమావేశాల్లో డిమాండ్‌ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం కార్మికుల సమస్యలపై నిర్లక్షధో రణితో ఉన్నదని, సింగరేణిలో సీఎండీ మారడం, డైరెక్టర్లు, జీఎం పర్సనల్‌ అధి కారులు మారడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయినట్టు సీతారామయ్య పేర్కొన్నారు. గతంలో జరిగిన స్ట్రక్చర్‌ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరిం చిన డిమాండ్లను అమలు చేయడం లేద ని, మెడికల్‌ బోర్డు నిర్వహించాలని డైరె క్టర్లను కలిసికోరినా కనీస స్పందన లేకుండా పోయినట్టు తెలిపారు. చాలా మంది కార్మికులు అనారోగ్యంతో డ్యూటీ లు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల్లో డిపెండెంట్‌ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వ కుండా జాప్యం చేయకుండా వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పేర్కొ న్నారు. ప్రధానంగా విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన 51 వేల కోట్ల బకాయి లు ఇప్పించాలని, మెడికల్‌ బోర్డు నిర్వహించాలని, సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్‌ మీద ఐటీ రీయింబర్స్‌, డిస్మిస్‌ కార్మికులకు అవకా శం కల్పించాలనే డిమాండ్లతో సమ్మెకు వెళ్ళనున్నట్టు తెలిపారు. కలిసి వచ్చే సం ఘాలతో చర్చించి సమ్మె తేదీని ప్రకటిస్తా మన్నారు. యాజమాన్యం, రాష్ట్ర ప్రభు త్వాల మొండి వైఖరికి నిరసనగా సమ్మె సైరన్‌ మోగిద్దామని, కార్మికవర్గం సిద్ధం గా ఉండాలని సీతారామయ్య పిలుపు నిచ్చారు. మడ్డి ఎల్లాగౌడ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:05 AM