వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:10 AM
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో వర దలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్దార్ రాజయ్య అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ రాజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, జూలై 30 (ఆంఽధ్రజ్యోతి) : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో వర దలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్దార్ రాజయ్య అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ రాజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఎక్కడైనా రోడ్లు ధ్వంసం అయితే తక్షణమే రహ దారులను మళ్లీంచేలా చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎంపీడీవో కొప్పుల శ్రీని వాస్, రూరల్ ఎస్‌ఐ మధూకర్ , డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరి షత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ నరేందర్ గురువారం సందర్శించారు. ఎంపీడీఓ తిరుపతి, ఎంపీఓ వేణుమాధవ్, ఏపీఓ రమేష్, సూపరింటెండెంట్ రవి బాబు, కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులు, కాలానుగుణంగా ప్రబలే వ్యాధుల నివారణ చర్యలు, జలసిరి కార్యక్ర మాల విజయవంతానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ప్రజలు వ్యక్తిగత పరి శుభ్రత పాటించడం, మరిగించి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, జ్వరం, దగ్గు, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసు పత్రిని సంపద్రించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అమలు చేసి, ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.