Share News

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:20 PM

సైబర్‌ నేరాల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, లింకులపై జాగ్రత్తగా వ్యవ హరించాలని కోరారు.

సైబర్‌ మోసాలపై   అప్రమత్తంగా ఉండాలి

జ్యోతినగర్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, లింకులపై జాగ్రత్తగా వ్యవ హరించాలని కోరారు. ‘ఆగండి.. ఆలోచిం చండి.. నిర్ధారించుకోండి’ అనే సూత్రాన్ని పాటిస్తే ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు సైబర్‌ నేరాలు, ఆన్‌ లైన్‌ మోసాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్‌ అం బర్‌ కిషోర్‌ ఝా, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరె క్టర్‌, హెడ్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్‌ ఫియాజ్‌ టైయబ్‌, డీసీపీ బి.రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. కమిషనర్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిం చుకుంటూ ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యవ స్థీకృతంగా మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్‌ హెచ్చరించారు. యువ ఇంజనీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ నేరాల నివారణకు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగిం చాలని పిలుపునిచ్చారు. గుర్తుతెలియని వ్య క్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, ఫోన్‌కాల్స్‌పైఅప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. మోసాలకు పాల్పడే విధానాలను వీడియోలను ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శించి ఉద్యోగులు, అధికారులకు అవగాహన కల్పిం చారు. ఏసీపీ రమేష్‌, సీసీపీఎస్‌ ఏసీపీ రం గారెడ్డి, రామగుండం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ కుమార్‌, ఎన్టీపీసీ ఎస్‌ఐ వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:20 PM