బీసీలు పాలకులుగా ఎదగాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:04 AM
దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడి పాలించే నేతలుగా బీసీలు ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యభవన్‌లో సోమవా రం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లా డారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడి పాలించే నేతలుగా బీసీలు ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యభవన్‌లో సోమవా రం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లా డారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా, 136 కులాల మద్దతు కలిగిన బీసీలు బలహీన వర్గాలు కాదని, వారు ఈ సమాజానికి వెన్నె ముక వంటి బలమైన శక్తి అని ఆయన పేర్కొ న్నారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో 60 మంది బీసీ అభ్యర్థులను గెలిపించుకుని అసెం బ్లీకి పంపడమే బీసీ ఉద్యమ ప్రధాన ఉద్దేశ మని తెలిపారు. ఓటుతో అగ్రకులాల ఆధిప త్యాన్ని ఓడించాలని, రాష్ట్ర పాలనలో బీసీల ముద్ర ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీలిచ్చిన రాజకీయ పార్టీలు ఆ మాట నిలబెట్టుకోలేదని, కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటు న్నాయని మండిపడ్డారు. బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ దాసరి ఉష మాట్లాడుతూ జిల్లాలో బీసీ భవన నిర్మాణ ఆవశ్యకతపై ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులతో చర్చి స్తామని పేర్కొన్నారు. రాబోయే రాజకీయ సవా ళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని, వచ్చే ఎన్నికలలో తమ బలాన్ని నిరూపించుకుం టామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి జాతీయ అధ్య క్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్, మాజీ ఫిషరీస్ చైర్మన్ చేతి ధర్మయ్య, బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండ సతీష్, మహిళా కన్వీనర్ సిరవేణి స్వప్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు మండే లక్ష్మి, నాగమణి, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నాయ కులు రాజయ్య, రవి,ఽ కొండయ్య, రమేష్, లక్ష్మ ణ్, బుగ్గ రామస్వామి, పాల్గొన్నారు.