Share News

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:56 PM

తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని శుక్ర వారం రాత్రి గోదావరిఖని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో బార్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు.

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

కోల్‌సిటీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని శుక్ర వారం రాత్రి గోదావరిఖని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో బార్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలతో బతుకమ్మ పండుగను నిర్వహించే సాంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సూరజ్‌సింగ్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట్‌ సచిన్‌రెడ్డి, న్యాయమూర్తి స్వారిక, బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలు చం దాల శైలజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అమరేందర్‌రావు పాల్గొన్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో శుక్రవారం రాత్రి బతు కమ్మ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా హాజరై మాట్లాడారు. పండుగల సమయంలో ప్రజల భధ్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌ సిబ్బంది రేయింబవళ్లు విధులు నిర్వహిస్తు న్నారని చెప్పారు. మహిళా పోలీస్‌ అధికారులు ఉత్సాహంగా ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని మక్కాన్‌సింగ్‌ యువసేన చైర్మన్‌ మనాలీ ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను గోదావరినదిలో నిమజ్జనం చేశారు. మహిళా కార్పొరేటర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:56 PM