బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:12 AM
జిల్లా కేంద్రంలోని అయ్య ప్ప గుడి వద్ద ఈ నెల 15న నిర్వహించనున్న బహుజన బతుకమ్మ పోస్టర్ ను ఆదివారం పలు ప్రజా సంఘాల ప్రతినిఽధులు అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అయ్య ప్ప గుడి వద్ద ఈ నెల 15న నిర్వహించనున్న బహుజన బతుకమ్మ పోస్టర్ ను ఆదివారం పలు ప్రజా సంఘాల ప్రతినిఽధులు అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు. రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తు రు సదానందం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని పలువురు కోరారు. ఏఐఎఫ్‌టియూ జిల్లా నాయకులు బుద్దుల రమేష్, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు యాకూబ్, తిర్రి బాలకృష్ణ, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం, జిల్లా అఽధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, జిల్లా నాకులు రాజు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్య క్షుడు నర్ల గోపాల్ పాల్గొన్నారు. బహుజన బతుకమ్మ నిర్మాణ కమిటీ చైర్మన్ విమలక్క, అరుణోదయ సంస్థ బృందం పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.