Share News

కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:05 AM

కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పవిత్ర ఆరోగ్య సిబ్బందిని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధి కారి కరపత్రం విడుదల చేశారు.

కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి

పెద్దపల్లి టౌన్‌, జూలై 13 (ఆంఽధ్రజ్యోతి): కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పవిత్ర ఆరోగ్య సిబ్బందిని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధి కారి కరపత్రం విడుదల చేశారు. ఆమె మాట్లా డుతూ ఆరోగ్యవంతమైన తల్లి, బిడ్డ అభివృద్ధి చెందిన సమాజం అవసరమని, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు, శాశ్వత పద్ధతులు గురించి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలలో అవగాహన కల్పించి ఆచరించేటట్లు చేయాలని కోరారు. కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించిన ఉత్తమ సిబ్బం దికి ప్రశంస పత్రాలు అందజేశారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డా.శ్రీరాములు, మాతాశిశు సంర క్షణ అధికారిని డాక్టర్‌ లక్ష్మి భవాని, డిపిహెచ్‌ ఎల్‌ దయామని, డిప్యూటీ డెమో అనిల్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్ర మాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.పవిత్ర సోమ వారం ప్రారంభించారు. టిజి ఎంఆర్‌ఈఐఎస్‌ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్ర మంలో ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీరాములు, పాఠశాల ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి, పిఓలు డా.కిరణ్‌కుమార్‌, డా.సంజనీష్‌ కుమార్‌, వైద్యాధికారి డా.అతుల్య, ఎస్‌.నాయర్‌ మాత్రలు పంపిణీ చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 12:05 AM