Share News

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:44 PM

ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు.

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు. ఈట్‌ రైట్‌ అవగాహన వాక్‌ థాన్‌ కార్యక్రమంను ఐటీఐ మైదానం నుంచి జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి వరకు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు. పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని, వంటల్లో అధిక ఆయిల్‌ వాడకం తగ్గించాలన్నారు. రోజు 30 నిమిషాలు కనీస వ్యాయామం లేదా నడవడం మంచిదన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఆర్‌ రాజమౌళి, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కావేటి రాజగోపాల్‌, లయన్స్‌ క్లబ్‌, వైద్య అధికారులు డాక్టర్‌ శ్రవణ్‌, డాక్టర్‌ మమత, డాక్టర్‌ సంయుక్త, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:44 PM