రహదారి భద్రతపై అవగాహన
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:23 PM
రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అరైవ్, అలైవ్ ఫేస్-3 కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కోల్‌సిటీ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అరైవ్, అలైవ్ ఫేస్-3 కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారుల ప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్ప నిసరిగా సీటు బెల్టు ధరించాలని, ప్రస్తుతం జరుగుతున్న 70శాతం రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ ధరించకపోవడంతో ప్రాణ నష్టం జరు గుతుందన్నారు. ఫోర్ వీలర్ వాహనాల్లో ఎయిర్ బ్యాగులు ఉన్నప్పటికీ సీటు బెల్ట్ ధరించకపోతే అవి సమర్థవంతంగా పని చేయవన్నారు. ఎయిర్ బ్యాగులు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్‌ను తప్పకుండా ధరించాలని, చిన్న దూరమైన, పెద్ద దూరమైనా ప్రతి ప్రయాణంలో సీటు బెల్ట్ ధరించడం అలవాటు చేసుకుంటే 90శాతం ప్రమాదాలు నివారించవచ్చునని, ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చునన్నారు. రోడ్డు భధ్రతపై బాధ్యత యుతంగా వ్యవహరించాలని వాహనదారులను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్ సీఐ ప్రసాద్‌రావు, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐలు రమేష్, అనూష, హరిశేఖర్, రామరాజు, మనోహర్ పాల్గొన్నారు.