ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:03 AM
అల్లీపూర్ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయం పై మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. చిన్నబొంకూరు, రెబ్బల్దేవ్‌పల్లి, మియాపూర్ నుంచి 125 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి కాంతారావు, మండల వ్యవసాధికారి పైడితల్లి మాట్లాడుతూ ప్రకృ తి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అల్లీపూర్ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయం పై మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. చిన్నబొంకూరు, రెబ్బల్దేవ్‌పల్లి, మియాపూర్ నుంచి 125 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి కాంతారావు, మండల వ్యవసాధికారి పైడితల్లి మాట్లాడుతూ ప్రకృ తి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. అల్లీపూర్ సర్పంచ్ సాయి కిరణ్ మాట్లాడుతు రైతులు మూస పద్ధతిలో వ్యవ సాయం చేస్తున్నారని, అధికారులు, వ్యవసా య శాస్త్రవేత్తల సలహాలు పాటించి ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్థిక చేయూతను పొందా లన్నారు. స్వప్న, మంజుల సమన్వయంతో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు, ఎన్‌ఎం ఎన్‌ఎఫ్ కిట్లు పంపిణీ చేశారు. ఏఈఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవాలంటే ప్రకృతి వ్యవ సాయమే మార్గమని మండల వ్యవసాయ అధికారి జె.అనూష స్పష్టం చేశారు. మైదం బండ రైతువేదికలో వ్యవసాయాధికారి మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి భూమి ని రక్షించుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించే పద్ధతులపై అవగాహన కల్పించారు. పాల్గొన్న రైతులకు న్యాచురల్ ఫార్మింగ్ కిట్లతో పాటు భూసార పరీక్షల కార్డులను అందజేశారు. సర్పంచ్ బి. శివకుమార్, ఏఈఓలు జి.హారిక, కె. సౌమ్య, రైతులున్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చే శిక్షణలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రామ గిరి వ్యవసాయ అధికారులు గిరి రామకృష్ణ, సింగం శ్రీకాంత్‌లు తెలిపారు. గుండారం రైతువేదికలో పలువురు రైతులకు శిక్షణను అందించారు. దృశ్యశ్రవణం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలను వివరించారు. సిద్దిపల్లి సర్పంచ్ బంగారు మహేష్, కల్వచర్ల సర్పం చ్ రేండ్ల శారద, వ్యవసాయ అధికారులు గిరి రామకృష్ణ, చిందం శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారులు అరవిందు, అనూష, రైతులు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): ఎలిగేడు రైతు వేదికలో దృశ్య శ్రవణ మాద్యమం ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ఎరు వుల బుకింగ్ యాప్, సాయిల్ హెల్త్ కార్డుల ప్రయోజనాల గురించి వివరించారు. రైతు లకు సాయిల్ హెల్త్ కార్డులు, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన కిట్లు పంపిణీ చేశారు. వ్యవసాయ అఽధికారి ఉమాపతి, సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ ముంజం నరేష్, ఏఈఓ సురేష్ పాల్గొన్నారు.