Share News

గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:06 AM

గౌడ ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.

గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం

కోల్‌సిటీ టౌన్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): గౌడ ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. గోపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవీ శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా నగదు పురస్కారాలను అందజేశారు. 589, 585, 583, 576, 571 మార్కులు సాఽధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో విద్య ఎంతో కీలకమన్నారు. ఇటీవల ఎన్నికైన గౌడ ప్రజాప్రతినిధులైన రామగుండం చెందిన బాలసాని తిరుపతిగౌడ్‌, మంథనికి చెందిన మాచిడి రాజుగౌడ్‌లను సన్మానించారు. గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దగొని రాంమోహన్‌గౌడ్‌, వీరయ్యగౌడ్‌, అమరగోని నరసయ్య, పెద్దంపేట్‌ శంకర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షులు మండ రమేష్‌గౌడ్‌, బందారపు యాదగిరిగౌడ్‌, కోశాధికారి దేవేందర్‌గౌడ్‌, బాలసాని స్వామిగౌడ్‌, గాదర్ల కొమరయ్యగౌడ్‌, ముక్కెర రాజజయ్య,, తిరుమల సురేందర్‌, బెందె నాగభూషణ్‌గౌడ్‌, మాచిడి మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:06 AM