Share News

రహదారి విస్తరణలో అధికారుల ఏకపక్ష వైఖరి

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:53 PM

పట్టణంలో ప్రధాన రహ దారి విస్తరణ పనుల్లో అధికారుల ఏకపక్ష వైఖరి, వ్యాపారులపై వేధిం పులకు నిరసనగా పెద్దపల్లి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు కమల్‌ కిషోర్‌ శారద ప్రకటించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

రహదారి విస్తరణలో   అధికారుల ఏకపక్ష వైఖరి

పెద్దపల్లి టౌన్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రధాన రహ దారి విస్తరణ పనుల్లో అధికారుల ఏకపక్ష వైఖరి, వ్యాపారులపై వేధిం పులకు నిరసనగా పెద్దపల్లి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు కమల్‌ కిషోర్‌ శారద ప్రకటించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రహదారి విస్తరణ పేరుతో 55 నుంచి 60 అడుగుల మేర హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా వ్యాపారులు, ఇళ్ల యజమానుల ఆస్తులను బలవంతంగా కూల్చివేస్తున్నారని ఆరోపిం చారు. ఏ ఒక్క వ్యాపారి, ఇంటి యజమాని స్వచ్ఛందంగా ఆస్తులు ఇచ్చేం దుకు అంగీకరించలేదని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండానే పనులు చేపడుతున్నారని విమర్శించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అంగీకరించిందంటూ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. తపాలా కార్యాలయం ఎదురుగా ఉన్న కజ్జపు చంద్రయ్య ఇంటి ముందు తీసుకున్న కొలతల ప్రకారమే అందరికీ సమానంగా రహదారి విస్తరణ చేపట్టాలని కోరినందుకు మున్సిపల్‌ అధికారి, పోలీసుల ద్వారా తనను అవమానానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పట్టణ అభి వృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పనులు చట్టబద్ధమైన విధానాల్లో చేపట్టి వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్ల క్రితం వ్యాపారుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన సంఘం ద్వారా ప్రస్తుత పరిస్థి తుల్లో న్యాయం చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. సంఘం నమోదు రద్దు ప్రక్రియ పూర్తయిన వెంటనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుం టానని కమల్‌ కిషోర్‌ శారద స్పష్టం చేశారు.

Updated Date - Nov 24 , 2026 | 11:53 PM