Share News

అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుశాతం పెంచాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:41 PM

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీపీడీవోలు, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం

అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుశాతం పెంచాలి

పెద్దపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీపీడీవోలు, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదును నిర్వహించాలని సూచించారు. కేంద్రాలకు హాజరయ్యే ప్రతీ చిన్నారికి నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలకు పాలు, కోడి గుడ్లు తదితర పోషకాహారాన్ని నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా అందించాలన్నారు. గర్భిణీలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి అక్కడే భోజనం చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వారికి పాలు, కోడి గుడ్లు పోషకాహారాన్ని నిబంధనల ప్రకారం అందించి మాతా, శిశు ఆరో గ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. చిన్నా రులకు నాణ్యమైన ప్రాథమిక విద్యతో పాటు ఆటాపాటల ద్వారా అభ్యా సం జరిగేలా అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతీ సోమవారం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలని అధికా రులను ఆదేశించారు. చిన్నారులకు బాలామృతంతోపాటు అందించాల్సిన అన్ని పౌష్టికాహార పదార్థాలు సక్రమంగా అందేలా పర్యవేక్షించాలన్నారు. జూలై 1న అన్ని తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కాళిం దిని, సీపీడీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:41 PM