దళితులు, పేద వర్గాలపై దాడులను ఉపేక్షించేది లేదు
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:59 PM
దళితు లు, పేదవర్గాలపై దాడులను ఉపేక్షించమని, గోదావరి ఖనిలో ఇటీవల మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉం టుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో గురువారం అక్షితరాణి కుటుం బాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దళితు లు, పేదవర్గాలపై దాడులను ఉపేక్షించమని, గోదావరి ఖనిలో ఇటీవల మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉం టుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో గురువారం అక్షితరాణి కుటుం బాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు తాము బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చామన్నా రు. ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న అక్షితరాణి మృతి బాధాకరమన్నారు. నిందితులకు చట్ట ప్రకారం కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశిం చినట్లు చెప్పారు. భవిష్యత్తులో దళితులు, పేద వర్గాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తు న్నట్లు వెల్లడించారు. దళితులు, పేద వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు వారికి సా మాజికంగా, ఆర్థికంగా అండ గా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రం లో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు తది తర ఘటనలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ హైలెవెల్ కమిటీ సమావేశం నిర్వహించి నట్లు చెప్పారు. బాధితుల పరిస్థితి, జీవన విధానం, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిశీలించి అవసరమైన సహాయం అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు.
ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పం దించి నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. నింది తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామ గుండం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. అక్షితరాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున మరో రూ.4.12 లక్షలు మొత్తం రూ.8.24 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి తెలిపారు. బాధిత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మని చెప్పారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులకు శిక్షపడేలా చూస్తామన్నారు. మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అక్షితరాణి ఘటనపై సమాచారం అం దిన గంటలోనే పోలీసులు స్పందించి చర్యలు ప్రారం భించారని, నిందితుడిని అరెస్టు చేశారని తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.