బీజేపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:42 PM
బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడి హేయమైన చర్య అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆరోపిం చారు. మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దాడిని నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసన వ్యక్తం చేయాలే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్ప డడం సరికాదన్నారు.
కళ్యాణ్‌నగర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడి హేయమైన చర్య అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆరోపిం చారు. మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దాడిని నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసన వ్యక్తం చేయాలే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్ప డడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొలేకనే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపు లాట చోటుచేసుకుంది. మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, నాయకులు లక్ష్మీనర్సయ్య, మచ్చ విశ్వాస్, గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్, అపర్ణ, కోడూరి రమేష్, మహేందర్, ప్రవీణ్, సరిత, రాజేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో చౌరస్తాలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు సోమారపు అరుణ్, మామిడి రాజేష్, మాతంగి రేణుక, జక్కుల నరహరి, దాసరి శ్రీనివాస్, పవన్, కొమ్ము శ్రీనివాస్, పంగ రవి వెంకటేష్ పాల్గొన్నారు.
పెద్దపల్లి టౌన్, (ఆంఽధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాం గ్రెస్ పార్టీ గూండాలు దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రం లో బీజేవైఎం నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాలను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ పెంజర్ల రాకేష్, వేల్పుల రమేష్, కూసనపల్లి మధుకరన్ భగవత్, రేండ్ల వేణు గుడ్ల సతీష్, మామిడి ఉమేష్, సురేందర్, పోగుల రాజు, సిలివేరి మహేష్, కుక్క అంజి,ముక్కెర కుమార్, వెలిచల నితిన్,తదితరులు పాల్గొన్నారు