క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:32 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ జిల్లా మానిటరింగ్ అధికారి డాక్టర్ పీఎం షేక్ అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ బాలబాలికల క్రీడా పోటీలు ఆదివారం నిర్వహించారు.
సుల్తానాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ జిల్లా మానిటరింగ్ అధికారి డాక్టర్ పీఎం షేక్ అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ బాలబాలికల క్రీడా పోటీలు ఆదివారం నిర్వహించారు. క్రీడలలో పాల్గొనేందుకు జిల్లాలోని 13 మండలాలకు చెందిన బాల బాలికలు కబడ్డీ, ఖోఖో,వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పాల్గొని క్రీడా ప్రతిభను చాటుకున్నారు. జిల్లా అధికారి షేక్ మాట్లాడుతు తగిన క్రీడా శిక్షణ పొంది రాష్ట్ర జాతీ య స్థాయిల్లో రాణిం చాలని, క్రీడలతో మానసి కోల్లాసం కలుగుతుందని, శారీరక దృఢత్వం ఏర్పడు తుందన్నారు. విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు వేల్పుల సురేందర్, కార్యదర్శి దాసరి రమేష్ పాల్గొన్నారు. పలువురు మహిళా వ్యాయామ ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు.